అన్నారం గ్రామంలో ఘనంగా సివిల్ రైట్స్ డే
తుంగతుర్తి, (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో(Annaram village) తుంగతుర్తి పోలీస్ శాఖ మరియు రెవెన్యూ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 'సివిల్ రైట్స్ డే' (పౌర హక్కుల దినోత్సవం) కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. తుంగతుర్తి సబ్ ఇన్స్పెక్టర్ రుద్ర క్రాంతి కుమార్ స్థానిక రెవెన్యూ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని గ్రామ ప్రజలకు పౌర హక్కులపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి ఒక్కరూ సమానమేనని, కుల వివక్షకు వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా నడవాలని పిలుపునిచ్చారు.
చట్టం ముందు అందరూ సమానులేనని, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం మరియు పౌర హక్కుల చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గ్రామంలో ఎలాంటి అంటరానితనం, వివక్షకు తావులేకుండా సామరస్యపూర్వక వాతావరణంలో జీవించాలని కోరారు.గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్న అధికారులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






