9 July, 2026 | 1:23 AM

కోర్ట్ రూమ్ డ్రామా డ్యూ డేట్

09-07-2026 12:29 AM

వర్షిష్ స్టూడియోస్ పతాకంపై ఏలూరు శ్రీను, పవన్ తరిగోపుల నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘డ్యూ డేట్’. ఆనంద్‌కే దర్శకత్వంలో తెరకెక్కుతునన ఈ సినిమాలో హీరోగా లోమేశ్ పూడిపెద్ది, హీరోయిన్‌గా జయశ్రీ నటిస్తున్నారు. ప్రణీత పట్నాయక్, విజ్ఞాని, చందు ఇతర ముఖ్యపాత్ర ల్లో నటిస్తున్న ఈ చిత్రానికి చెంచు జింక డీవోపీ.

ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబా ద్‌లో జరగ్గా, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సమాజంలోని ప్రస్తుత పరిస్థితులను ఆధారంగా అల్లుకున్న కమర్షియల్ కోర్ట్ రూమ్ డ్రామా ఇదని, త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని  నిర్మాతలు తెలిపారు.