27 August, 2026 | 12:48 PM

భూపాలపల్లి మైన్స్ ఏడీ బొజ్జ జయరాజ్ పై ఏసీబీ దాడులు

27-08-2026 12:16 PM

కార్యాలయంతో పాటు అతని నివాసాలలో ఏకకాలంలో దాడులు 

భూపాలపల్లి టౌన్, ఆగస్టు 27 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి మైన్స్ ఏడి సహాయ సంచాలకులు, భూగర్భ శాఖ బొజ్జ జయరాజ్ పై గురువారం ఉదయం నుండి ఏసీబీ(ACB Raids) దాడులు నిర్వహిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా ఆరోపణల నేపథ్యంలో వరంగల్ ఏసీబి డీఎస్పి సాంబయ్య ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మైన్స్ ఏడి కార్యాలయంలో(Mines AD Office), ఆయనకు సంబంధించిన నివాసాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సోదాలు పూర్తయితే ఎటువంటి ఆధారాలు బయట పడుతాయో తెలిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఉత్తమ అధికారిగా జయరాజ్ ప్రశంసా పత్రం అందుకున్నారు. ఇంతలోనే ఆయనపై ఏసీబి దాడులు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.