14 July, 2026 | 11:39 AM

Breaking News

కల్లూరులో గంజాయి రవాణా – ముగ్గురు అరెస్ట్   •   కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ   •   విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •  

వన్‌సైడ్ లవర్స్ బాగా కనెక్ట్ అయ్యే చిత్రమిది

09-07-2026 12:31 AM

అథర్వా, ప్రీతి ముకుందన్, కయదూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హృదయం మురళి’. ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ కీలక పాత్ర పోషించగా, సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించడంతోపాటు కీలక పాత్రలో నటించారు. నిహారిక, ద్రవిడ్, ఏంజెలిన్, అంజు కురియన్, సుధాకర్, యశశ్రీ, జోనిత ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. దర్శకుడు ఆకాశ్ బాస్కరన్ తెరకెక్కించిన ఈ సినిమా మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూలై 10న తెలుగులో రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో అథర్వా మాట్లాడుతూ.. “ప్రతి ఒక్కరి మనసుకు దగ్గరగా ఉండే సినిమా ఇది. వన్‌సైడ్ లవర్స్ ఈ కథతో చాలా కనెక్ట్ అవుతారు. ఈ చిత్రం ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది” అన్నారు.

‘ఇది హృదయాన్ని హత్తుకునే ప్రేమకథ’ అని ప్రీతి ముకుందన్  తెలిపారు. సెల్వన్ మాట్లాడుతూ.. “హృదయం మురళి’ ప్రేమ, స్నేహం గురించి చెప్పే అద్భుతమైన సినిమా” అని తెలిపారు. “గతంలో వచ్చిన ‘హృదయం’ ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ అయిందో, ‘హృదయం మురళి’ కూడా అంత పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం” అని మైత్రి శశి చెప్పారు.