27 August, 2026 | 2:58 PM

సర్‎లో డిక్లరేషన్ ఫామ్ నింపితే సరిపోతుంది

27-08-2026 12:19 PM

నారాయణఖేడ్, ఆగస్టు 27: సమగ్ర ఓటర్ సర్వేలో భాగంగా ఇటీవలే ఓటర్ లిస్టులో తప్పొప్పులకు సంబంధించి ఓటర్లకు ఇప్పటికే బీఎల్ఓలు నోటీసులు అందించిన విషయం విధితమే కాగా దీంతో సర్ నోటీసులో పేర్కొన్న అంశాల ప్రకారం అభ్యర్థులు స్థానికం ఇతర సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం డిక్లరేషన్ ఫామ్ జారీ చేసిందని నారాయణఖేడ్ డిప్యూటీ తహశీల్దార్ రాజు పాటిల్ గురువారం పేర్కొన్నారు. సంబంధిత ఫారాలు బిఎల్ఓ ల వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

అందులో పేరు మార్పు కానీ 2002-2026 ఓటర్ లిస్టు జాబితా ప్రకారం సంబంధిత అభ్యర్థికి సంబంధించి గ్రామస్థాయిలోనే బిఎల్ఓ విచారణ చేపట్టి అక్కడే డిక్లరేషన్ ఫామ్ అందించి వారి వివరాలు నమోదు చేసి వారి ఓటుకు సంబంధించిన సవరణను నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు లోకల్ క్యాస్ట్ ఇతర ఫారాల కోసం తహశీల్ కార్యాలయాల చుట్టూ ఇతర కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని తెలిపారు. విషయాన్ని గమనించాలని సూచించారు. దీంతో గ్రామస్థాయిలోనే సమస్యను అక్కడికక్కడే పరిష్కారం లభించే అవకాశం ఉందని తెలిపారు.