15-11-2025 12:53:39 AM
సీసీ రోడ్డును మట్టితో కప్పి మాయ చేస్తారా? మునిసిపల్ అధికారులు
అయిజ, నవంబర్ 14: జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ నందు సిసి రోడ్లకు మట్టి వేసి మున్సిపాలిటీ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే అయిజ మున్సిపల్ లోని 15, 16 వార్డుల మధ్య ఉన్న హరిజనవాడకు వెళుతున్న ప్రధాన రహదారి గతంలో సిసి రోడ్డు నిర్మించారు. అట్టి సీసీ రోడ్డు అంతంత మాత్రమే నాణ్యతగా నిర్మించారు.ఆ రోడ్డు ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు మోకాటి లోతు గుంతల మయంగా మారింది.
దీనికి తోడు మట్టి, ఇసుక ట్రాక్టర్లు అనేకంగా రాకపోకలు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్నాయి కూడా.అందువల్ల సీసీ రోడ్డు గుంతల మయంగా మారి మోకాటిలోతు గుంతలు ఏర్పడ్డాయి. దీనికి తోడు గత సంవత్సరం భగీరథ పైప్ లైన్ వచ్చి దారి పొడవునా ద్విచక్ర వాహనాలు వెళ్లేంత వెడల్పున రోడ్డు ఉన్నందువల్ల ద్విచక్ర వాహనదారులు నిబంధనలు మరిచి అటూఇటూ దానిపైనే వేగంగా వెళ్లడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇట్టి గుంతలు పడ్డ సి సి రోడ్డుకు మునిసిపల్ అధికారులు మట్టి కప్పి మమ అంటూ చేతులు దులుపుకున్నారు. మళ్లీ వర్షం వస్తే ఈ మట్టి పక్కకు తొలగి యధావిధిగా గుంతల మయంగా మారుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు . అధికారులు ఇట్టి ప్రధాన రహదారులకు శాశ్వత పరిష్కారం చూపాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు.