7 June, 2026 | 5:11 PM

'అగ్నివీర్'లుగా ఎంపికైన కరీంనగర్ యువకులకు సన్మానం

07-06-2026 04:23 PM

ముకరంపుర,(విజయక్రాంతి): 'ఫిట్నెస్ ఫ్రీక్స్' ఆధ్వర్యంలో భారత సైన్యంలో 'అగ్నివీర్'లుగా ఎంపికైన కరీంనగర్ యువకులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై దేశ రక్షణ కోసం సైన్యంలో అడుగుపెడుతున్న యువకులను, ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులను  ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

అనంతరం అగ్నివీరులుగా ఎంపికైన యువకులను శాలువాలతో ఘనంగా సన్మానించి, వారికి జ్ఞాపికలను అందజేశారు. యువత క్రమశిక్షణతో అంకితభావంతో దేశ సేవలో భాగస్వామ్యం కావడం కరీంనగర్ ప్రాంతానికే గర్వకారణమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు,ఫిట్నెస్ ఫ్రీక్స్ నిర్వాహకులు సురేష్  ఎంపికైన యువకుల తల్లిదండ్రులు,స్థానిక యువకులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.