calender_icon.png 15 November, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి అమ్ముతున్న ముగ్గురి అరెస్ట్

15-11-2025 12:53:11 AM

కొత్తపల్లి, నవంబర్ 14 (విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ సి ఐ ఏ. నిరంజన్ రెడ్డి, ఆదేశానుసారం ఎస్ ఐ ఏ. లక్ష్మా రెడ్డి , కానిస్టేబుల్ మరియు మహిళ సిబ్బంది తో కలిసి గుంటూరుపల్లి , బొమ్మకల్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు దుర్శేడ్ గ్రామానికి చెందిన నేరెళ్ల చరణ్ తండ్రి రాజు, గోపాల్ పూర్ గ్రామానికి చెందిన బెజ్జంకి లోకేష్ తండ్రి శ్రీనివాస్ మరియు మైనర్ బాలుడు కలిసి గంజాయితో వారి యమహా మోటార్ సైకిల్ పై వస్తూ పోలీస్ వారిని చూసి పారిపోయే ప్రయత్నం చేయగా వారిని పట్టుకొని చూడగా వారి మోటార్ సైకిల్ పై ఉన్న కవర్లో గంజాయి లభించింది.

ఆ తరువాత విచారణ చేయగా పై ముగ్గురు వ్యక్తులు చదువులు మధ్యలోనే మానివేసి జల్సాలకు అలవాటుపడి వారి అవసరాలను తీర్చుకొనుటకు గంజాయి ని మరో వ్యక్తి నుండి కొనుకొని వచ్చి కరీంనగర్ లోని చుట్టూ ప్రక్కల ప్రాంతాలలో అమ్ముతున్నారు. అదే క్రమంలో అమ్ముటకు వెళుతుండగా పోలీస్ వారు పట్టుకోవడం జరిగింది.

వారి వద్ద నుండి గంజాయి 260 గ్రాములు , ఒక యమహా మోటార్ సైకిల్ , కొంత నగదు మరియు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకోనైనది. ఈ సందర్భముగా సి ఐ ఏ. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ యువత చెడు అలవాటులకు బానిసలూ కావద్దని ,

జీవితాలను నష్టపరుచుకోవద్దని తెలుపడం జరిగింది మరియు ఎవరైనా గంజాయి అమ్ముతూ పట్టుబడితే వారిని జైలు కు పంపడం తో పాటు, వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి, ఇంకా మారకపోతే వారిపై పిడి ఆక్ట్ కూడా పెట్టుతామని హెచ్చరించడం జరిగింది.ఈ సందర్భంగా గంజాయి పట్టుకోవడంలో పాల్గొన్న ఎస్‌ఐ లక్ష్మారెడ్డి, కానిస్టేబుళ్లను మరియు మహిళా సిబ్బందిని కరీంనగర్ రూరల్ ఎసిపి విజయకుమార్ అభినందించడంజరిగింది.