7 June, 2026 | 5:10 PM

కుంరం నాగోరావ్ సేవలు చిరస్మరణీయం: వెడ్మ బొజ్జు పటేల్

07-06-2026 04:36 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): ఏటూరునగరం ఐటీడీఏ ఏపీవో జనరల్ కుంరం నాగోరావ్ గిరిజనులకు ప్రభుత్వపరంగా చేసిన సేవలు చిరస్పరణీయమని  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఏటూరు నాగారం ఐటీడీఏలో ఏపీవో జనరల్ గా పదవి విరమణ  చేశారు. పదవి విరమణ అనంతరం ఉట్లూరులోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నిర్మల్ డిసిసి అధ్యక్షులు,ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఈ సందర్భంగా ఏపీవో నాగోరావ్ తో పాటు కుటుంబీకులు సన్మానించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... కుంరం నగోరావ్ గారి సేవలు చిరస్మరణీయం అని,నేను పిసా కోఆర్డినేటర్ గా మరియు,ఆదివాసీ విద్యార్థి సంఘం లో ఉద్యమాలు చేసిన సమయంలో నాగోరావ్ సార్ గారి ప్రోత్సాహం ఉండేదన్నారు.నాకు చాలా మంచి అనుబంధం  ఉందని,ఈ ప్రాంతంలో వారు పనిచేసినప్పుడు ఏజెన్సీ ప్రాంత ప్రజలకు వారు ఎంతో ఉపయోగకరంగా ఉన్నారు. ఉద్యమ సమయంలోనూ యువతకు అండగా నిలిచారని,

రిటైర్మెంట్ తర్వాత కూడా వారి సేవలు అలాగే ఉండాలని సమాజంలో గుర్తింపు పొందిన వ్యక్తిగా నేటి యువతకు నాయకులకు, నాగోరావ్ కి ఈ ప్రాంతం పట్ల అవగాహన, అనుభవం ఉన్నందున వారి సలహా సూచనలు అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా అదనపు కలెక్టర్  ఆర్ఎస్ చిత్రు పటేల్, మాజీ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ఏపీవో(పివిటిజి) ఆత్రం భాస్కర్, జిల్లా ఉప విద్యాధికారి గోడం చందన్,కుటుంబ సభ్యులు,ఐటీడీఏ సిబ్బంది,వివిధ ఉద్యోగస్తులు,స్థానికులు పాల్గొన్నారు.