calender_icon.png 15 November, 2025 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపులి దాడిలో ఆవు మృతి..!

14-11-2025 11:31:39 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని బుగ్గ గూడెం అటవీ ప్రాంతంలో గల రాళ్లవాగు సమీపంలోని పత్తి చేనులో గురువారం సాయంత్రం పెద్దపులి ఆవుపై దాడి చేసి హత మార్చింది. గురువారం రాత్రి పత్తి చేనులో ఆవు గాయపడి మృతి చెందిన ఘటన పశువుల కాపరి ద్వారా తెలిసింది. శుక్రవారం ఉదయం అటవీశాఖ అధికారులు బుగ్గ గూడెం ప్రాంతంలోని పత్తి చేనులో మృతి చెందిన ఆవును గుర్తించారు. మృతిచెందిన ఆవు బుగ్గ గూడెం గ్రామానికి చెందిన పల్లె ఎల్లక్క ది గా నిర్ధారించారు.

కాగా దేవాపూర్ అటవీ రేంజ్ పరిధిలోని ఎగండి గ్రామ శివారులో కూడా ఆవుపై  పెద్దపులి దాడి చేసి హతమార్చింది. అటవీ సమీప గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. పశువులను అడవుల్లోకి పంపకుండా ఇళ్ల వద్దనే కట్టేసి ఉంచాలని కోరుతున్నారు. రాత్రి వేళల్లో అటవీ మార్గాల గుండా ప్రయాణించవద్దని సూచిస్తున్నారు.