15-11-2025 12:00:00 AM
-ఎస్.డి.ఆర్. సేవలు ప్రశంసనీయం
- సౌకర్యాల ఏర్పాటుకు కృషి
- జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్
ములుగు,నవంబర్ 14(విజయక్రాంతి): అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, అభివృద్ధి విషయంలో అన్ని శాఖలతో పాటు పోలీసుల సహకారం అందడం గొప్ప విష యమని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు.
శుక్రవారం గోవిందరావుపేట మండలం చల్వాయిలోని తెలంగాణ స్పెషల్ పోలీస్ ఐదవ బెటాలియన్ లో నూతన జిమ్, ఓపెన్ ఏరియా జిమ్ ను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ ములుగు జిల్లా లాంటి ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగుల పని చేయడం సాహసం చేయడం లాంటిదేనని, ఏ పని చేసిన ప్రజల మన్ననలు పొందడానికి కృషి చేయాలని అన్నారు.
విపత్కర పరిస్థితులలో ఎస్ డి ఆర్ ఎఫ్ చేసిన సేవలు ప్రశంసనీయమని, ములుగు జిల్లాలోని కాకుండా వరంగల్ జిల్లాలో సైతం వారి సేవలను అందించడం హర్షించ దగ్గ విషయమని అన్నారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడే విషయం లో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాహసం చేయడం గొప్ప విషయ మని అన్నారు. కష్టంతోనే ఫలితం దక్కుతుందని, ప్రతి ఒక్కరూ తమ విధులను బాధ్యత గా నిర్వహించాలని సూచించారు.
బెటాలియన్లు కావలసిన సౌకర్యాల ఏర్పాటుకు అనుకూలం కృషి చేస్తానని హామీ ఇస్తూ నూతన రోడ్డు ఏర్పాటు కోసం అంచనాలు తయారు చేసి సమర్పించాలని తెలిపారు. ములుగు జిల్లాలో పోలీస్ శాఖ చేస్తున్న సేవ లు గొప్పగాని రానున్న రోజులలో వారి సేవలు ఇలాగే కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా బెటాలియన్ లో కలెక్టర్ మొక్కను నాటారు.