8 April, 2026 | 12:53 AM

కోమటిపల్లి పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్

15-11-2025 12:00 AM

రామాయంపేట, నవంబర్ 14 :రామయంపేట మున్సిపల్ పరిధిలోని కోమటిపల్లి పాఠశాలలో గురువారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆ యా తరగతుల వారీగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను ఆవిష్కరించారు. ప్రత్యేక ఆకర్షణగా నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ అందరి దృష్టిని ఆకర్షించింది.

బాలబాలికలే స్వయంగా వండిన వంటకాలను స్టాళ్లు ఏర్పాటు చేసుకొని విక్రయించడం విశేషం. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ పిల్లలలో నాయకత్వ లక్షణాలు, వ్యాపార దృక్ప దం, జట్టుగా పనిచేసే నైపుణ్యాలు పెంపొందించడానికి ఫుడ్ ఫెస్టివల్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.