24 May, 2026 | 10:23 AM

21నుంచి సీపీగెట్ రెండో విడత కౌన్సెలింగ్

14-09-2024 12:39 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): ఈనెల 21 నుంచి రెండో విడత ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షల (సీపీగెట్) కౌన్సెలింగ్ ప్రారంభంకానుం ది. అదేరోజు నుంచి అభ్యర్థులు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఈమేరకు షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ టీజీ సీపీగెట్ ఇన్‌చార్జి కన్వీనర్ ప్రొ. పీ జలపతి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మొదటి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 20వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలని సూచించారు. మిగతా వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.