17 April, 2026 | 11:03 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

నిజం గెలిచింది కోర్టులో నిరూపణ అయింది..

09-06-2025 07:52 PM

సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం..

అనర్హత పిటిషన్ కొట్టివేయడంతో పాల్వంచలో సీపీఐ సంబరాలు..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): నిజం గెలిచింది ఆ విషయం కోర్టు తీర్పుతో నిరూపణ అయిందని, ప్రజా తీర్పును అపహాస్యం చేద్దామని కొందరు స్వార్థపరులు చేసిన ప్రయత్నం కోర్టు తీర్పుతో భంగపడ్డారని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం(CPI Rashtra Samithi members Mutyala Vishwanath) అన్నారు. కొత్తగూడెంకి చెందిన మందులాల్ అగర్వాల్ ఎమ్మెల్యే కూనంనేనిపై వేసిన అనర్హత పిటిషన్ గౌరవ హైకోర్టు సోమవారం డిస్మిస్ చేయడంతో పాల్వంచలో సిపిఐ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటాయి. స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్ నుండి పాల్వంచ పట్టణంలోని ప్రధాన కూడలిలో టపాసులు కాలుస్తూ ప్రదర్శన నిర్వహించారు.

పూనంనేనికి అనుకూలంగా తీర్పురావటంతో తమ ఆనందాన్ని ప్రజలతో పంచుకున్నారు కూనంనేని జిందాబాద్, సిపిఐ జిందాబాద్ నినాదాలతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ... ఎన్నికల అనర్హత పిటిషన్ కొట్టివేస్తూ గౌరవ హైకోర్టు ప్రత్యర్థికి మొట్టికాయలు వేసిందన్నారు. దీనితో ధర్మం ఆలస్యమైన నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి సాయిబాబా మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు ఉప్పుశెట్టి రాహుల్ గుండాల నాగరాజు, నాయకులు అన్నారపు వెంకటేశ్వర్లు, నిమ్మల రాంబాబు, మన్నెం వెంకన్న, రహమాన్, గౌస్, Ys గిరి, వేములపల్లి రాజశేఖర్, కోరే కృష్ణ, రామారావు, సర్వయ్య తదితరులు పాల్గొన్నారు.