24 August, 2026 | 11:42 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

హక్కుల సాదనకు పోరాటాలే శరణ్యం

24-08-2026 10:34 PM

సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు రేసు ఎల్లయ్య

ఆళ్లపల్లి,(విజయక్రాంతి): హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం అనీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య అన్నారు. ఆగస్టు 24 ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆటో కార్మికులు తలపెట్టిన సమ్మెను ప్రభుత్వం దిగివచ్చి ఆటో డ్రైవర్ల డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపి సమ్మె రద్దు చేశారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక బస్టాండ్ సెంటర్లో ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకోవడం సంతోషకరమే అని వారు తలపెట్టిన అన్ని డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించి ఆటో డ్రైవర్ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ఏదైనా పోరాడితేనే సమస్య పరిష్కారం అవుతుంది అని కాబట్టి పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకోవచ్చు అని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండల అధ్యక్షుడు కుంట సహదేవ్, ఏఐటీయూసీ నాయకులు సాంబయ్య మదర్ కృష్ణ చిరంజీవి చింటూ అజహార్ సద్దాం తదితరులు పాల్గొన్నారు.