25 August, 2026 | 12:28 AM

కోరం లేని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బోయిని శంకర్ ఎన్నికల చెల్లదు

24-08-2026 10:37 PM

బీర్కూర్ సర్పంచ్ ల ఫోరం ఉపాధ్యక్షుడు రెంజర్ల అనిల్ కుమార్

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలోనీ బీర్కూర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా బోయిని శంకర్ ను కోరం లేని పోరం సర్పంచులు ఎన్నుకోవడం చాలా బాధాకరమని బీర్కూర్ సర్పంచ్ ల ఫోరం ఉపాధ్యక్షుడు రెంజర్ల అనిల్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం బీర్కూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనిల్ కుమార్ మాట్లాడుతూ బీర్కూర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అరిగే ధర్మతేజ కీ ఆరుగురు సర్పంచులు బలంతో మొత్తం ఏడుగురు సర్పంచులు ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ధర్మ తేజ ఎన్నిక చెల్లుతుందనీ బీర్కూరు మండల ప్రజలకు ఉపాధ్యక్షులు రెంజర్ల అనిల్ పేర్కొన్నారు.

బీర్కూరు 13 గ్రామాలు ఉన్నాయి ఫోరం అధ్యక్షత కావాలంటే ఏడుగురు(7) మెజారిటీ సర్పంచులు కావాలి. అయితే బోయిని శంకర్ కు ఐదుగురు సర్పంచులు కలిసి అధ్యక్షులు ఎన్నుకోవడం సరికాదు అని అన్నారు. ప్రజలకు ప్రతి ఒక్క విషయం అర్థమవుతుందన్నారు.రాజకీయాన్ని ఖూనీ చేయడం సిగ్గుచేటు అన్నారు. NREGS ఫండ్స్ ఆరుగురు సర్పంచులకు ఏ విధంగా వస్తాయి, మిగతా ఏడుగురు సర్పంచులకు ఏ విధంగా నిధులు మంజూరు కావు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏది ఏమైనప్పటికీ పార్టీలు శాశ్వతం కాదు మానవత్వం శాశ్వతం. ఇకనుంచి అయినా పెద్ద మనసుతో కలిసికట్టు భావనతో  బీదాభిప్రాయాలు  లేకుండా పని చేయాలని కోరారు.