03-12-2025 12:46:41 PM
హైదరాబాద్: అఖండ-2 సినిమా టికెట్ రేట్ల పెంపుపై సీపీఐ నారాయణ స్పందించారు. సినిమా టికెట్ల రేట్ల పెంచడం వల్లే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేదని ఆయన పేర్కొన్నారు. సినిమా టికెట్ రేట్లు పెంచి ప్రజలపై భారం వేసి, సంపన్న వర్గాలకు ఊడిగం చేస్తూ, సామాన్య ప్రజలను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐబొమ్మ రవి లాంటి వాళ్ళను అరెస్ట్ చేసే నైతిక హక్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదని నారాయణ విరుచుకుపడ్డారు.
కాగా, అఖండ2 సినిమాకు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం మంగళవారం అనుమతినిచ్చింది. డిసెంబర్ 4న రాత్రి 10 గంటల ప్రిమియర్ షోకు అనుమతిస్తూ, టికెట్ ధరను రూ.600గా నిర్ణయించింది. విడుదలైన రోజు నుండి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ ధియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్‌లో రూ.100 పెంచుకునేందుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.