03-12-2025 01:49:16 PM
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో(Shamshabad Airport) సాంకేతిక లోపం కారణంగా విమానాలు రద్దు అయ్యాయి. ఇండిగో విమానాల రాకపోకల్లో ఆలస్యం అయినట్లు అధికారులు తెలిపారు. దీని కారణంగా ప్రయాణికులకు తీవ్రఅసౌకర్యం కలిగింది. శబరి వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులకు(Ayyappa devotees) ఇబ్బంది పడ్డారు. శంషాబాద్ నుంచి ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్ కతా, భువనేశ్వర్, గోవా, అహ్మదాబాద్ వెళ్లే విమానాలు, ఢిల్లీ, భువనేశ్వర్, చెన్నై నుంచి వచ్చే విమానాలు కూడా రద్దు అయ్యాయి. ఇవాళ శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన 7 విమానాలు, విమానాశ్రయానికి రావాల్సిన 12 విమానాలు రద్దు అయినట్లు అధికారులు వెల్లడించారు.
నిన్న కూడా శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి వెళ్లాల్సిన తొమ్మిది విమానాలు, రావాల్సిన 5 విమానాలు రద్దు అయ్యాయి. అహ్మదాబాద్ వంటి ప్రధాన దేశీయ నగరాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారు కూడా అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. అర్ధరాత్రి తర్వాత బెంగళూరుకు బయలుదేరాల్సిన ఇండిగో విమానం రన్‌వేపై ఉన్నప్పుడు సాంకేతిక లోపం తలెత్తడంతో సమస్య మొదలైంది. ఆ విమానం దాదాపు రెండు గంటల పాటు నిలిచిపోయి టెర్మినల్‌కు తిరిగి తీసుకురాబడింది. తరువాత, అందరు ప్రయాణీకులను దింపేశారు. ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలకు సంబంధించి తదుపరి ప్రకటనల కోసం విమానాశ్రయం లోపల వేచి ఉన్నారు.
రద్దు చేయబడిన విమానాలు ఇవే..
6E 240 – హైదరాబాద్ నుండి ఢిల్లీ
6E 6467 – హైదరాబాద్ నుండి మధురై (IXM)
6E 6361 – హైదరాబాద్ నుండి బెంగళూరు
6E 922 – హైదరాబాద్ నుండి భువనేశ్వర్
6E 206 – గోవా–హైదరాబాద్
6E 6337 – అహ్మదాబాద్–హైదరాబాద్
6E 295 – చెన్నై–హైదరాబాద్
6E 609 – మధురై–హైదరాబాద్
6E 6360 – బెంగళూరు–హైదరాబాద్
6E 247 – ఢిల్లీ–హైదరాబాద్
6E 631 – భువనేశ్వర్–హైదరాబాద్