16 March, 2026 | 10:52 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఐ నిరసన

16-03-2026 06:07 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరిచేలా పెంచిన గృహ వినియోగదారుల గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ పార్టీ మండల శ్రేణులు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో వంట గ్యాస్ ధరల పెంపును నిరసన తెలిపి, ధరలను తగ్గించాలని డిప్యూటీ తహశీల్దార్ సమ్మయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను రూ.60, కమర్షియల్ సిలిండర్ ధరను రూ.115 పెంచడం పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారంగా మారిందన్నారు. పేద ప్రజలపై భారాలు మోపుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. వెంటనే పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

నిత్యావసర వస్తువుల ధరలను అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ మండల కార్యదర్శి సబ్కా నాగేశ్వరరావు, జిల్లా సమితి సభ్యులు పేరాల శ్రీనివాసరావు, అలవాల సీతారామరెడ్డి మండల సీనియర్ నాయకులు సిద్ధారపు సుబ్బారెడ్డి, ముదిగొండ బాలకృష్ణ బలరాం, కూరపాటి దాసు, కుంజా నాగరాజ్, సింగబోయిన వెంకటేశ్వర్లు, సోయం విజయబాబు, కొమరం రాజేష్ పాల్గొన్నారు.