యుద్ధాన్ని ఆపాలని సీపీఐ రాస్తారోకో
బెల్లంపల్లి,(విజయక్రాంతి): పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని, అమెరికా, ఇజ్రాయిల్ లు ఇరాన్ పై చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో(CPI Rasta Roko) నిర్వహించారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బెల్లంపల్లి పట్టణ కంటచౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్, సీనియర్ నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య మాట్లాడుతూ ఇరాన్ లోని సమర సంస్థలను ఆక్రమించుకొనుటకు దుష్టప న్నాగంలో భాగంగా ఇరాన్ అన్వాయిదాలను కలిగియున్నదని సాకు చెబుతూ ఇజ్రాయిల్ తో కలిసి అమెరికా ఇరాన్ పై యుద్ధానికి తెగపడిందని మండిపడ్డారు.
క్షిపణులతో దాడులు చేస్తూ బాంబుల వర్షం కురిపించి అనేక సంస్థలను భవనాలను పాఠశాలలను నాశనం చేస్తూ, పౌరులు, చిన్నారి విద్యార్థుల ప్రాణాలను బలికంటూన్నారని విమర్శించారు. యుద్ధంతో తీవ్ర నష్టం కలిగిస్తూ ప్రపంచశాంతికి భంగం కలిగిస్తున్నారనీ విమర్శించారు. వెంటనే యుద్ధాన్ని ఆపి ప్రపంచ శాంతిని కాపాడాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో సమురుకు గాని గ్యాస్కు కొరత లేదంటూ బిజెపి మోడీ ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచుతున్నదని విమర్శించారు.
సామాన్యులపై అదనపుభారాన్ని మోపుతు గ్యాస్ కొరత కారణంగా అనేక హోటల్లు మూతపడుతున్నయని వాపోయారు. హోటల్ కార్మికుల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నానీతెలిపారు. వస్తువుల ధరలు పెరిగి సామాన్యులపై అధిక భారం పడుతుందన్నారు. మోదీ అమెరికాకు నమ్మిన బంటుగా మారి 140 కోట్ల భారత పౌరుల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుచున్నారని విమర్శించారు.. ఈ కార్యక్రమంలో పట్టణ సమితి కార్యదర్శి ఆడెపు రాజమౌళి, రాష్ట్ర సమితి సభ్యురాలు పూర్ణిమ,మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ పట్టణ సహకార దర్శి బొల్లం తిలక్ అంబేద్కర్, జిల్లా సమితి సభ్యులు రత్నం రాజ్యం, గుండా చంద్రమాణిక్యం, పట్టణ కార్యవర్గ సభ్యుడు రామచందర్, మహిళా సంఘం నాయకురాలు బొల్లం సోని, బొంతల కళారాణి, కాసిపేట స్వర్ణలత పాల్గొన్నారు.




