3 August, 2026 | 9:46 PM

Breaking News

జాతీయ రహదారిపై సీపీఎం ఆందోళన

03-08-2026 08:40 PM

అంబేద్కర్ సెంటర్ రోడ్డు గుంతల మయం

నిత్యం  ప్రజల నరకయాతన

పాల్వంచ,(విజయక్రాంతి): స్థానిక అంబేద్కర్ సెంటర్ లో జాతీయ రహదారి గుంతల మయంగా మారిందని నిత్యం విపరీతమైన రద్దీగా ఉండే ఈ కూడలిలో శాశ్వత మరమ్మతుల చేపట్టాలని సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ మార్గంలో వేలాది వాహనాలు తిరుగుతుంటాయి. ఇసుక లారీలు, కేటీపీఎస్ వెళ్లే యాష్ లారీలు, సారపాక పేపర్ మిల్లు కు వెళ్లే జామాయిల్ కర్ర లారీలు, స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, కార్లు ట్రాక్టర్లు,ఆటోలు ద్విచక్ర వాహనాలు ఈ సెంటర్ నుండి తిరగాలి.

వ్యాపార సముదాయాలు సినిమా హాలులు ఈ సెంటర్ లోనే ఉండటం వలన ప్రజలు ఎక్కువగా ఇక్కడ కాలినడకన కూడా ఎక్కువగా తిరుగుతుంటారు. ఇంత రద్దీగా ఉండే జాతీయ రహదారిపై శాశ్వత రోడ్డు వేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఇప్పటికైనా అధికారులు మైనింగ్ కాలేజ్ పెట్రోల్ బంక్ నుండి ఇందిరాకాలనీ వరకు జాతీయ రహదారిపై శాశ్వత మరమ్మత్ పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు ఎం జ్యోతి, కమిటీ సభ్యులు దొడ్డ రవికుమార్, పట్టణ కార్యదర్శి పి.తులసి రామ్, కార్యవర్గ సభ్యులు కే.సత్య ఎస్కె నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.