3 August, 2026 | 10:36 PM

ఖానాపూర్ మున్సిపాలిటీలో కోతుల పట్టివేత

03-08-2026 09:35 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ పలు వార్డుల్లో కోతులు నివారణకు తగు చర్యలు తీసుకుంటున్నామని ఖానాపూర్ చైర్మన్, వైస్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్, మహమ్మద్ షోయబ్ లు తెలిపారు. ఈ మేరకు సోమవారం పట్టణంలో కోతుల నివారణకు చర్యలు చేపట్టారు. వారు మాట్లాడుతూ కోతులను పట్టి పునరావాస కేంద్రాలకు తరలించి కోతుల బెడద లేకుండా చేస్తామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ప్రకాష్ గౌడ్ ,మనోజ్ ,మల్లేష్, అజీమ్, శేఖర్ తదితరులు ఉన్నారు.