3 August, 2026 | 10:51 PM

ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన మాల సంఘం నూతన కార్యవర్గం

03-08-2026 09:45 PM

ధర్మపురి,(విజయక్రాంతి): వెల్గటూర్ మండల కేంద్రంలోని మాల సంఘం నూతన కార్యవర్గ సభ్యులు సోమవారం స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) ఉదయ్ కుమార్ ను సోమవారం  మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నూతన కమిటీ ఎన్నికైన నేపథ్యంలో ఎస్సైని కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై ఉదయ్ కుమార్ మాట్లాడుతూ... సంఘాన్ని ఉన్నతమైన ఆదర్శాలతో ముందుకు తీసుకెళ్లాలని, సమాజ శ్రేయస్సు కోరి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం గౌరవ అధ్యక్షులు మూగల శ్రీనివాస్, అధ్యక్షులు మూగల సతీష్, ఉపాధ్యక్షులు పొనగంటి రాజేందర్, కోశాధికారి మూగల శేఖర్, సభ్యులు లకుమల్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.