30 May, 2026 | 10:30 PM

Breaking News

ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు   •   ఖాతాదారుల సేవా కేంద్రం నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం   •   గిరిజన యువతీ యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం   •   మండల టాపర్‌ మేకా మాన్వితకు ట్రిపుల్ ఐటీ సీటు   •   పెద్దమల్లారెడ్డిలో అగ్నిప్రమాదం.. గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధం   •   వరికొయ్యలు కాల్చవద్దు... బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు   •   కూచిపూడి నృత్యంతో అలరించిన మోక్ష ధృతి   •   అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలి: సీడీపీవో జ్యోతి   •   ఘట్కేసర్ లో ప్రారంభమైన సిపిఎం శిక్షణ తరగతులు   •   రైతు డిస్కమ్ రైతాంగానికి శాపం   •  

ఘట్కేసర్ లో ప్రారంభమైన సిపిఎం శిక్షణ తరగతులు

30-05-2026 09:59 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ప్రపంచ మానవాళి విముక్తికి మార్క్సిజమే ఏకైక మార్గమని ఆ సిద్ధాంతం మాత్రమే ఒక మనిషిని మరొక మనిషి దోచుకునే వ్యవస్థను సమూలంగా మార్చి దోపిడీ లేని  నూతన సమాజాన్ని నిర్మిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి పి. సత్యం అన్నారు. శనివారం ఘట్కేసర్ పట్టణంలో సిపిఎం మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులలో సత్యం ముఖ్యఅతిథిగా పాల్గొని అంతర్జాతీయ జాతీయ పరిస్థితులు అనే అంశంపై క్లాస్ బోధించారు. ఈ తరగతులకు  సిపిఎం మండల కార్యదర్శి ఎన్. సబిత ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. ఈ శిక్షణా తరగతుల ప్రారంభ సూచకంగా సిపిఎం సీనియర్ నాయకులు చింతల యాదయ్య సిపిఎం పతాకాన్ని ఎగురవేశారు.