30 July, 2026 | 9:25 AM

అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలి: సీడీపీవో జ్యోతి

30-05-2026 10:02 PM

భూత్పూర్ :  చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని సీడీపీవో జ్యోతి అన్నారు. ఈ సందర్భంగా భూత్పూర్ మండల పరిధిలోని తాటికొండ గ్రామంలో నిర్వహించిన అంగన్వాడి బడిబాట కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య సేవలు, శారీరక–మానసిక వికాసానికి సంబంధించిన ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరించారు.

ఈ సందర్భంగా సూపర్‌వైజర్ సుశీల మాట్లాడుతూ అర్హులైన ప్రతి చిన్నారిని అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించి ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు కరుణమ్మ, మాణిక్యమ్మ, దర్శనమ్మ, ఫాతిమా పాల్గొని కేంద్రాల్లో అందిస్తున్న సేవల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ ఆయాలు, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.