calender_icon.png 15 September, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరితమ్మ కోటకు బీటలు!

15-09-2025 12:00:00 AM

- నడిగడ్డలో మారుతున్న రాజకీయ పరిణామాలు 

- మొదటి నుంచి ఊరిస్తున్న పదవులు

- బీఆర్‌ఎస్ పార్టీలో భారీగా కాంగ్రెస్ నాయకుల చేరికలు

- అయోమయంలోకాంగ్రెస్ నాయకులు

గద్వాల, సెప్టెంబర్ 14 ( విజయక్రాంతి ) :కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి జెడ్పిటీసి గా గెలిచి గద్వాల జిల్లా తొలి జెడ్పి చైర్ పర్స న్‌గా అంచలంచెలుగా ఎదిగి బి ఆర్ ఎస్ పా ర్టీ లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మధ్యలో వర్గ పోరుతో 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి తన అనుచర వర్గం తో చేరింది. గద్వాల లో కాంగ్రెస్ పార్టీ కి బలమైన నాయకులు లేకపోవడంతో సరితమ్మ దారి మరింత సులువుగా మారింది. వెంటనే పార్టీ 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ ఇవ్వడం ఎన్నికల్లో బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మీద ఫోటి చేయడం స్వల్ప ఓట్ల తేడా తో ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ అన్యూహంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కాస్త బలం పెరిగింది. తన కున్న రాజకీయ అనుభవం, ఇతర పెద్దల సహకారం తీసుకుంటూ తమ అనుచరులకు, ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందేలా తన వంతు ప్రయత్నం చేస్తూ నే వస్తుంది. 

 మొదటి నుండి ఊరిస్తున్న పదవులు 

గద్వాల రాజకీయం అంటే బంగ్లా కుటుంబం అన్న మాదిరిగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే. అలాంటి బంగ్లా కుటుంబానికి ఢీ కొడుతూ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యే అభ్యర్థి గా ఫోటి చేసి చివరికి అదే బంగ్లా కుటుంబం చేతిలో ఓడిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమకు రా ష్ట్ర స్థాయి లో ఉన్నతమైన పదవి వస్తుందని అభివృద్ధి చేసి చూపుతాం అని ప్రచారం లో జరిగిన మాటలు గాల్లో పెట్టిన దీపంలా మారింది.

ఎమ్మెల్యే బండ్ల రాకను పూర్తి స్థా యి లో వ్యతిరేకించిన పంచాయతీ కాస్త హైదరాబాద్ లోని గాంధీభవన్ కు చేరడం ఒక వైపు అయితే, పలు అభివృద్ధి పర్యటన లో భాగంగా గద్వాల కు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణా రావుకు, ఇతర మంత్రుల, ప్రజల ముందే పంచాయతీలు జరగడం సరితమ్మ కు మైనస్ గా మారిందని స్వంత పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. ప్రభు త్వం ఏర్పాటు అయినా తరువాత ఇదిగో పదవి అదిగో పదవి అంటూ ప్రచారం తప్ప ఆచరణలో మాత్రం ఏమి కనిపించడం లేదని అసలు పదవి ఇస్తారా లేకపోతే ఇవ్వ రా అని ఆమె ను నమ్ముకుని ఉన్న మా పరిస్థితి ఏమిటి అన్న సమాధానం లేని ప్రశ్నగా నాయకులు బహటంగా చెప్పలేక అంతర్గతంగా చర్చించుకుంటున్నారన్న పుకార్లు జోరుగా గద్వాల నియోజకవర్గం లో వినిపిస్తున్నాయి. 

 నడిగడ్డ లో మారుతున్న రాజకీయ పరిణామాలు .....

నడిగడ్డ రాజకీయం అంటేనే రాష్టంలోనే ఒక ప్రత్యేకత. నడిగడ్డ లో మారుతున్న రాజకీయ పరిణామాలు రోజు రోజుకు మరింత వేడిని కలిగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మరింత సంచలనంగా మారుతున్నాయి. ఒక వైపు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లలేదని ఇంకా బి ఆర్ ఎస్ లోనే ఉన్నానని చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో తన హవా ను జోరుగానే నడిపిస్తున్నారు. సరిత వర్గం కు సంబందించిన వాళ్లకు కాకుండా గద్వాల మార్కెట్ యార్డ్ పదవులు, జమ్ములమ్మ దేవాలయ పదవులు సైతం ఎమ్మెల్యే వర్గానికి రావడం, మంత్రులు సైతం ఎమ్మెల్యే కు పూర్తి స్థాయి లో మద్దత్తు తెలుపుతుండండం తో సరిత మ్మ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది అంటూ కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు. 

 బి ఆర్ ఎస్ పార్టీ లో భారీగా కాంగ్రెస్ నాయకుల చేరికలు 

గద్వాల నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ లో ని ముఖ్య నాయకులు మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ జెడ్పి టీసి లు, మాజీ ఎంపిటిసి లు శనివారం గద్వాల జి ల్లా కేంద్రం లో జరిగిన గద్వాల గర్జన సభలో బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామా రావు సమక్షంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని వీడుతూ బి ఆర్ ఎస్ పార్టీ లో చేరడంతో గద్వాల నియోజకవర్గం మొత్తం చర్చంచశానీయంగా మారింది. 

 అయోమయం లో కాంగ్రెస్ నాయకులు ..... 

కాంగ్రెస్ పార్టీ ని వీడి బి ఆర్ ఎస్ పార్టీ లో ముఖ్య నాయకులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు చేరడం ఒకవైపు అయితే, ఎమ్మె ల్యే వర్గానికి ముఖ్య మైన పదవులు దక్కడం సరితమ్మ కు 20 నెలలుగా ఎలాంటి పదవి రాకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ వర్గం నాయకులకు కాంగ్రెస్ పార్టీ నుండి ఏ అభ్యర్థు లకు బి ఫామ్ లు వస్తాయి ఎవరి వెంబడి ఉండాలి అన్న అయోమయంలో కాంగ్రెస్ నాయకులకు తలనొప్పి గా మారింది.