అటల్ సేతుపై పగుళ్లు
22-06-2024 12:05 AM
ముంబై, జూన్ 21: దేశంలోనే అతిపెద్ద సీ లింక్ బ్రిడ్జి అటల్ సేతుపై ప్రారంభించిన ఐదు నెలలకే పగుళ్లు వచ్చాయి. ముంబై హార్బర్ సమీపంలో ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (ఎంటీహెచ్‌ఎల్) ప్రాజెక్టును రూ.17,840 కోట్లతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. దీనికి మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టారు. ఈ బ్రిడ్జి నిర్మా ణాన్ని కేంద్రప్రభుత్వం, బీజేపీ గొప్ప గా ప్రచారం చేసుకొన్నాయి. గత జనవరిలో ప్రధాని మోదీ దీనినిప్రారంభించారు. తాజాగా ఎంటీహె చ్‌ఎల్‌లోని అప్రోచ్ రోడ్డుపై పగుళ్లు ఏర్పడటంతో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.






