9 June, 2026 | 4:16 PM

Breaking News

కొలాయిడ్ సిస్టును తొలగించిన మలక్ పేట యశోద వైద్యులు   •   పొలం పనులు పూర్తికాకముందే తొందర పెడుతున్న తొలకరి జల్లులు   •   ప్రభుత్వ కళాశాలలో చేరాలని ప్రచారం   •   పిడుగులతో పాటు కురిసిన భారీ వర్షం వనికిన జనం   •   ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన కార్పోరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు   •   వైద్య సేవల్లో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ కె.హరిత   •   ఆర్అండ్‌బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు   •   రానున్న రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు   •   స్టేషన్ ఘన్‌పూర్‌లో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి   •   ఎప్టీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం... పరిశ్రమల ద్వారా పెద్దఎత్తున ఉపాధి   •  

పాటతో తుఫాన్ సృష్టిస్తుందా?

17-09-2024 03:55 AM

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తన ఇన్‌స్టా ఖాతాలో ఓ కొత్త పోస్ట్ చేసింది. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, ఆసక్తికరమైన చర్చలకు దారి తీసింది. ‘స్టోమ్ రైడర్’ అని రాసి ఉన్న పోస్టర్‌ను షేర్ చేయడం ద్వారా అందరిలో ఉత్సాహాన్ని రేకెత్తించిందీ శ్రీలంక సింగారం. ఇది రాబోయే సింగిల్ లేదా పూర్తి ఆల్బమ్‌కు సంబంధించిన టైటిల్ కావొచ్చని అందరూ భావిస్తున్నారు. జాక్వెలిన్ మొదటిసారి పాడుతూ కనిపించబోతోందా? లేక కొత్త పాటలో కనిపించనుందా? అని అంతా చర్చించుకుంటున్నారు.

ఈ పోస్టర్‌లో జాక్వెలిన్ బోల్డ్‌గా కనిపిస్తోంది. ఇటీవల ఈ బ్యూటీకి సంబంధించిన ‘యిమ్మీ యిమ్మీ’ అనే పాట బాగుందంటూ మానీ లాండరింగ్ కేసు నిందితుడు సుకేశ్ జైలు నుంచి విడుదల చేసిన ప్రేమలేఖలో అభినందించాడు. తన లాయర్ ద్వారా సుకేశ్ మీడియాకు ఆ లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాను ఆ పాటను చాలాసార్లు చూశానంటూ సొగసరి అందంపై ప్రశంసలు కురిపించాడు. జాక్వెలిన్ బాలీవుడ్‌కు నిజమైన క్వీన్ అంటూ లేఖలో రాసుకొచ్చాడు.