10 August, 2026 | 8:15 PM

మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ

10-08-2026 06:03 PM

వృథాగా పోతున్న తాగునీరు

కొండపాక,(విజయక్రాంతి): కొండపాక మండలం దుద్దెడ టోల్‌గేట్ సమీపంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ ఏర్పడి భారీగా తాగునీరు వృథాగా పోతోంది. పైప్‌లైన్ నుంచి నీరు ఉధృతంగా బయటకు రావడంతో పరిసర ప్రాంతంలో పెద్దఎత్తున నీరు నిలిచిపోయింది. దీంతో రహదారి పక్కన బురదమయంగా మారడంతో పాటు తాగునీటి వృథాపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విలువైన తాగునీరు వృథాగా పోకుండా అధికారులు వెంటనే స్పందించి పైప్‌లైన్ లీకేజీని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.