10 August, 2026 | 7:20 PM

Breaking News

అంబేద్కర్ నగర్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శ్రీకారం   •   పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణపై అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం   •   సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన పద్మా రెడ్డి   •   మానవతా దృక్పథంతో గల్ఫ్ కార్మికుడి మృతదేహం స్వదేశానికి   •   ఘనంగా లక్ష బిల్వార్చన పూజ   •   శ్రీ చైతన్య హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థిపై దారుణ దాడి..!   •   శారాజిపేటలో డప్పుల కళాకారులకు డ్రెస్సుల పంపిణీ   •   ఎల్ హెచ్ పీఎస్ జిల్లా అధ్యక్షుడిగా భూక్య మంగీలాల్ నాయక్ నియామకం   •   బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలి   •  

వరుణ యాగం సరే.. రైతులకు గోదావరి నీళ్లు ఇవ్వండి

10-08-2026 06:15 PM

మాజీ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య

తుంగతుర్తి (విజయక్రాంతి): ఎలినినో ప్రభావం తో సగటు వర్షం కురవక. చెరువులు కుంటలు నిండకా రైతాంగం పంటలు ఎలా కాపాడుకోవాలి అని బిక్కు బిక్కు మంటుంటే ,వరద పారుతున్న గోదావరి జలాలను ఇవ్వమని అడుగుతుంటే పట్టించుకోని ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వరుణ యాగం చేయడం విడ్డూరంగా ఉందని మాజీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ నాయకులు వరుణ యాగం అడ్డుకుంటారనే భయం తో ముందస్తు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని పేర్కొన్నారు. పోలీసులు ముందస్తు అరెస్ట్ అయిన వారిలో తాటికొండ సీతయ్య  మండల అధ్యక్షులు గ్రామానాయకులు బైరోజు దేవేంద్రచారి ,కొల్లూరి లింగయ్య కోరుకొప్పుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.