స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా నిత్య పూజలు
స్వామివారిని దర్శించుకున్న మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట దేవస్థానంలో సోమవారం నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు. శ్రీ స్వామి వారి ఆలయంలో ఉదయం సుప్రభాత సేవతో గర్భగుడిలో కొలువు దీరిన స్వయంభులను సువర్ణ ప్రతిష్ట మూర్తులను వేదమంత్రోచరణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో అర్పించారు. ప్రాకారమంటపంలో నృసింహ హోమం, నిత్య కళ్యాణంను వైభవంగా నిర్వహించారు.
సాయంత్రం వెండి జోడు సేవ స్వామివారు తిరువీధులలో ఊరేగారు. శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర ఆలయంలో స్వయంభు లింగం, స్పటిక లింగంకు భక్తులు దర్శించుకున్నారు.. శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు పాల్గొన్న మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, దర్శన అనంతరం వేదశీర్వచనం చేసిన వేదపండితులు.స్వామి వారి లడ్డు ప్రసాదం అందజేసిన ఆలయ అధికారులు.






