7 June, 2026 | 1:22 AM

అవయవదానం.. మరో ఆశాకిరణం

07-06-2026 12:00 AM

అవయవదానం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని, సమాజంలో అవయవదానంపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచ అవయవ మార్పిడి దినోత్సవాన్ని పురస్కరించుకొని అపోలో ఆస్పత్రులు శనివారం బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ఎ కీ దట్ ఓపెన్స్ న్యూ హోప్ సెలబ్రేటింగ్ ది గిఫ్ట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమాన్ని నిర్వహించాయి. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా, నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి డా. శ్రీభూషణ్ రాజు గౌరవ అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ వైద్య విద్యా సంచాలకుడు డా. ఏ. నరేంద్ర కుమార్, ఎన్‌హెచ్‌ఎస్ బ్లడ్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ అసోసియేట్ మెడికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ జేమ్స్ న్యూబెర్గర్ ప్రసంగించారు.

అవయవదానం ద్వారా ఇతరులకు జీవనావకాశం కల్పించిన దాత కుటుంబాలను ఈ సం దర్భంగా సన్మానించారు. అవయవ మార్పిడి పొందిన పలువురు తమ అనుభవాలను పంచుకొని కొత్త జీవితాన్ని పొందిన ఆనందాన్ని వివరించారు. అపోలో ఆస్ప త్రుల తెలుగు రాష్ట్రాల సీఈఓ తేజస్వి రావు వీరపల్లి మాట్లాడుతూ.. అవయవదానం అనేది ఒక వ్యక్తి అందించగలిగే అత్యంత గొప్ప బహుమతి అని అన్నారు. అవయ వాల అవసరానికి, లభ్యతకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ప్రజల్లో మరింత చైతన్యం అవసరమని పేర్కొన్నారు.

లివర్ ట్రాన్స్‌ప్లాంట్ విభాగాధిపతి డా. శరత్ పుట్ట మాట్లాడుతూ.. 1984లో ట్రాన్స్‌ప్లాంట్ సేవలను ప్రారంభించినప్పటి నుంచి అపోలో దేశవ్యాప్తంగా 27,500కు పైగా ఘన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించిందని తెలిపారు. వీటిలో 21,500కు పైగా కిడ్నీ, 5,000 లివర్, 400 హార్ట్-లంగ్ ట్రాన్స్‌ప్లాంట్లు ఉన్నాయ ని చెప్పారు.

అపోలో ఆస్పత్రుల తెలుగు రాష్ట్రాల సీఈఓ తేజస్వి రావు వీరపల్లి మాట్లాడుతూ, జీవన్దాన్ పథకం, పోలీసుల గ్రీన్ ఛానల్ వంటి ప్రభుత్వ చర్యలు అవయవదాన ఉద్యమానికి ఎంతో బలాన్నిస్తున్నాయని తెలిపారు. ఈ చర్యల వల్ల మరిన్ని కుటుంబాలు అవయవదానానికి ముందుకు వస్తున్నాయని, అనేక మంది రోగులకు సకాలంలో అవయవాలు అందుతున్నాయని చెప్పారు.

లివర్ ట్రాన్స్‌ప్లాంట్ శస్త్రచికిత్స నిపుణులు డా. రాఘవేంద్రబా బు, డా. రవిచంద్, హార్ట్-లంగ్ ట్రాన్స్‌ప్లాం ట్ సర్జన్ డా. గోపాలకృష్ణ గోఖలే, హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డా. ఏ. నాగేశ్, లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ వైద్యులు డా. చైతన్య భట్టు, డా. చేతన్ రావు వడ్డెపల్లి, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ నిపుణులు డా. సోమశేఖర్, డా. శ్రీధర్, డా. సత్యనారాయణ పాల్గొన్నారు. అలాగే యూరాలజిస్ట్ డా. సుబ్రహ్మ ణ్యం కొలను కుదురు, హీమటో-ఆంకాలజిస్టులు డా. పవన్ కుమార్ బోయెల్ల, పద్మజ లోకిరెడ్డి, నేత్ర వైద్య నిపుణుడు రాజేష్ ఫోగ్లా, మైక్రో హ్యాండ్ సర్జన్ జి.ఎన్ భండారి పాల్గొన్నారు.