4 June, 2026 | 1:17 AM

ఏఐతో అవకాశాల సృష్టి

04-06-2026 12:00 AM
  1. తురింగియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ భేటీ
  2. బోధనా విధానాలు, యువత నైపుణ్యాలను మెరుగుపర్చాలన్న సీఎం
  3. తెలంగాణ రైజింగ్ 2047పై సీఎం మారియో వోయిట్ ప్రశంసలు
  4. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ చాటుతున్న తెలంగాణ యువత
  5. సెమీకండక్టర్ ప్రత్యేక బృందాన్ని తెలంగాణకు పంపుతాం

హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): ఉపాధిరంగంలో భారీ మార్పుల నేపథ్యంలో ఏఐ ప్రభావం నూతన అవకాశాలు సృష్టిస్తుందని, జర్మనీ, జపాన్, దక్షిణకొరియా వంటి దేశాలకు అవసరమైన నైపుణ్యాలతో తెలంగాణ యువతను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బోధనా విధానాలను మార్చేందుకు జర్మనీలోని తురింగియా రాష్ట్రం సహకారం అవసరమని అన్నారు. బుధవారం సచివాలయంలో తెలంగాణ ప్రభుత్వాల మధ్య పలు రంగాల్లో పరస్పర సహకారానికి ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.తురంగియా సీఎం మారియో వోయిట్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైంది.

ఈ నేపథ్యంలో టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరస్పర సహకారం అవసరమని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం ప్రకటించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌పై మారియో వోయిట్ ప్రశంసలు కురిపించారు. ఇరుప్రాంతాలకు ప్రయోజనం చేకూరేలా పనిచేయాలని నిర్ణయించారు. జర్మనీలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు ఏమిటో గుర్తించి వాటికి అనుగుణంగా తెలంగాణ యువతకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని మారియో అన్నారు. ఈ భేటీలో తురింగియా స్టేట్ సెక్రెటరీలు డాక్టర్ టైచార్ట్, సకెర్ట్, జర్మన్ కాన్సుల్ జనరల్ హాస్పర్ సహా వివిధ రంగాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు సీఎస్ రామకృష్ణారావు, అజిత్‌రెడ్డి, టీజీఐఐసి ఎండి శశాంకలు పాల్గొన్నారు.ర