4 June, 2026 | 1:18 AM

విజ్ఞాన్స్ వర్సిటీలో గూగుల్ ఏఐ ల్యాబ్

04-06-2026 12:00 AM

హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో అడ్వాన్స్‌డ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జెమిని ఎంటర్‌ప్రైజ్ ఫర్ ఎడ్యుకేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ‘గూగుల్ ఏఐ ల్యాబ్’ను బుధవారం ప్రారంభించారు.

ముఖ్య అతిథిగా హాజరైన గూగుల్ క్లౌడ్ ఎడ్యుకేషన్ రీజినల్ హెడ్ నవిషా ప్రభాకర్ మా ట్లాడుతూ.. ఫిన్టెక్, ఆరోగ్యరంగం, రోబోటిక్స్, ఇంజినీరింగ్, ఆటోమేషన్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అనేక రంగాల్లో ఏఐ అపార అవకాశాలను సృష్టిస్తోందని పేర్కొన్నారు. అయితే విద్యార్థులను ఇతరుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టేది వారి జిజ్ఞాస, కొత్త విషయా లు నేర్చుకోవాలనే తపన అని వివరించారు.

విజ్ఞాన్ విశ్వవిద్యాలయం ఈ ప్రాంతంలో ఏఐ విద్యకు నాయకత్వం వహిస్తూ విద్యార్థులను కేవలం సాంకేతిక పరిజ్ఞాన వినియోగదారులుగానే కాకుండా, భవిష్యత్ సృష్టికర్తలు, ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దేందుకు ముందడుగు వేసిందన్నారు. ఏఐ రంగంలో వేగంగా నేర్చుకుని, మార్పులను స్వీకరించే వారే భవిష్యత్లో ముందంజలో ఉంటారని పేర్కొన్నారు. మరో ముఖ్య అతిథి గూగుల్ భాగస్వామ్య సంస్థ హెనోటిక్ గ్రూప్ సీఈవో బి మల్లేశ్ మాట్లాడుతూ.. ఏపీలో గూగుల్ ఏఐ ల్యాబ్‌ను ఏర్పా టు చేసిన తొలి విశ్వవిద్యాలయం విజ్ఞాన్ కావ డం గర్వకారణమని పేర్కొన్నారు.

ఈ ఏఐ ల్యా బ్‌తో పాటు పలు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గూగుల్ ఏఐ ల్యాబ్తో పాటు ‘జెమిని ఎంట్ర్పజ్ ఫర్ ఎడ్యుకేషన్’ను విద్యార్థులు, అధ్యాపకులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. వర్సిటీ చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య సూచించినట్లుగా అన్ని కార్యక్రమాలు వాస్తవ సమస్యలకు పరిష్కారాలు అందించే దిశగా ఉండాలని పేర్కొన్నారు.

విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ.. గూగుల్ ఏఐ ల్యాబ్ను కేవలం పేరుకే పరిమితం చేయకుండా, పూర్తిస్థాయిలో కార్యాచ రణాత్మకంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. దేశంలోనే పరిశ్రమల్లో శిక్షణ కోసం అధ్యాపకులను పంపిస్తున్న అరుదైన విశ్వవిద్యాల యాల్లో విజ్ఞాన్ ఒకటని పేర్కొన్నారు. విజ్ఞాన్ ప్రాంగణాన్ని నిజమైన కృత్రిమ మేధస్సు (ఏఐ) కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, ఇందుకు విశ్వవిద్యాలయ యాజమా న్యం వందశాతం నిబద్ధతతో పనిచేస్తోందని విజ్ఞాన్స్ యూనివర్సిటీ సీఈవో డాక్టర్ మేఘ న కూరపాటి పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కేవీ క్రిష్ణకిషోర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీఎంవీ రావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.