మీడియా మిత్రులకు క్రికెట్ టోర్నీ
శేరిలింగంపల్లి, మే 27 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో వివిధ కమిషనరేట్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు పరస్పర స్నేహభావం, ఐక్యతను బలోపేతం చేసేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో సీపీ కార్యాలయం పేర్కొంది. ఈ టోర్నీలో పాల్గొనదలచిన మీడియా ప్రతినిధులు తమ తమ జట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.
జట్టు పేరు, క్రీడాకారుల జాబితా, ఇతర వివరాలను సిద్ధం చేసి రెండు రోజుల్లోగా, అంటే మే 29వ తేదీలోగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో డీసీపీ సంజీవ్ను 8712663033 నంబర్లో సంప్రదించాలని కోరింది.మీడియా మిత్రుల సహకారం,భాగస్వామ్యంతో ఈ క్రీడా వేడుకను విజయవంతం చేయగలమని సైబరాబాద్ కమిషనరేట్ క్రీడా విభాగం ఆశాభావం వ్యక్తం చేసినట్లు ప్రకటనలో తెలిపింది.






