అప్పుల భాధతో ఆత్మహత్య
సిద్దిపేట రూరల్: ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు కట్టలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. రూరల్ ఏఎస్ఐ కిష్టయ్య తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చత్రి తిరుపతి(45) గ్రామంలో తన ఇల్లు నిర్మించుకోవడం 2025 జనవరి లో రూ. 9,92,632 హౌసింగ్ లోన్ తీసుకున్నారు. ప్రతీ నెల రూ. 17,976 చొప్పున ఈఎంఐ చెల్లించాల్సి ఉండగా, గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇన్టాల్ మెంట్ లు కట్టలేక ఆయన తీవ్ర మనస్తాపానికి గురై ఆగస్టు 3 న మధ్యాహ్నం డబ్బుల పనిమీద బయటకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుండి వెళ్లి, 4వ తేదీన ఉదయం ఇంటి వెనుక ఉన్న చింతచెట్టుకు త్రాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య చత్రి ఎల్లవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.






