28 May, 2026 | 1:56 AM

ఈద్గా వద్ద ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

28-05-2026 12:00 AM

బోధన్, మే 27 (విజయక్రాంతి): గురువారం బక్రీద్ పండుగ పురస్కరించుకొని ముస్లిం మైనారిటీలు ప్రార్థనలు నిర్వహించే ఈద్గా ను కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ప్రార్ధనల కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ సిబ్బంది తగిన సౌక ర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి ఒక్కరూ మత సామారస్యాన్ని కాపాడుతూ ప్రశాంత వాతావరణంలో పండుగను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ జాదవ్ కృష్ణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దాము, సీనియర్ నాయకులు తూము శరత్ రెడ్డి, మీర్ నజీర్ అలీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.