5 August, 2026 | 9:31 AM

రైతులకు సకాలంలో పామాయిల్ మొక్కలు అందించాలి: మంత్రి తుమ్మల

05-08-2026 08:41 AM

మంత్రి తుమ్మల ఆదేశాలు.

సత్తుపల్లి,ఆగస్టు(విజయక్రాంతి): పామాయిల్ సాగు విస్తీర్ణం తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పామాయిల్ మొక్కలను సకాలంలో అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) కీలక ఆదేశాలు జారీ చేశారు. దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం  ఉమ్మడి ఖమ్మం జిల్లా  ఆయిల్ ఫెడ్ ప్రత్యేక అధికారి సుధాకర్ రెడ్డి మంత్రి తుమ్మల తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పై దృష్టి సారించాలని ఆయిల్ షెడ్ లో మొక్కలు కొరత ఉన్నచో ప్రవేట్ నర్సరీ నుంచి పామ్ ఆయిల్ మొక్కలను సరఫరా చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.