1 August, 2026 | 10:53 AM

అంకితభావంతో పని చేస్తేనే నేరాల అదుపు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

24-08-2024 04:58 PM

జగిత్యాల, (విజయక్రాంతి): పోలీస్ అంకితభావంతో పని చేస్తే నేరాలు అదుపులోకి తీసుకురావడం పెద్దపని కాదని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లాలోని పెగడపల్లి పోలీస్ స్టేషన్ ఎస్పీ శనివారం ఆకస్మికoగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ... డయల్ 100 కాల్స్ కి తక్షణమే స్పందించి వెంటనే  సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకోవా లని, సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

సిబ్బంది ఎంతమంది ఉన్నారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తు న్నాయని తెలుసుకున్నారు. ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహి స్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.  డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరిం చాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం గస్తీ నిర్వహించాలని 24గంటలు ప్రజలకు అందుబా టులో ఉంటూ ప్రజల సమస్య తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. 

సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా నిర్వహించడంద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయన్నా రు. ప్రస్తుతo సైబర్ నేరాలు పెరిగి పోయాయి వాటిపైన ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గంజాయి నివారణ పై ప్రత్యేక దృష్టి సారించి సరఫరా, విని యోగంపై కఠినంగా వ్యవహరిం చాలని ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు.  మల్యాల సీఐ రవి, ఎస్ఐ రవికిరణ్, సిబ్బంది  పాల్గొన్నారు.