హైడ్రా చట్టం రాష్ట్రవ్యాప్తంగా అమలు పర్చాలి
ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్
కోరుట్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా చట్టం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ అన్నారు. శనివారం కోరుట్ల పట్టణంలోని సి. ప్రభాకర్ గ్రంథాలయంలో అధ్యక్షులు చెన్న విశ్వనాథంతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేట భాస్కర్ మాట్లాడుతూ హైడ్రా చట్టం (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానటిరింగ్ అండ్ ప్రొటెక్షన్) ద్వారా స్పెషల్ ఫోకస్ పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చట్టాన్ని రాష్ట్ర వ్యాప్త అమలు చేయాలన్నారు.జగిత్యాల జిల్లా కోరుట్లలోని తాళ్ల, మద్దెల చెరువు ఎఫ్ టిఎల్ భూములు, కంచెర, పీతిరి, కుమ్మరి, లస్మా గౌడ్ కుంట, వాగు పరివాహక ప్రాంతం బపార్ జోన్, రోడ్లు, చెరువుల కాల్వలు, దేవాలయ, వక్ బోర్డ్ భూములు అన్యా క్రాంతం అవుతు కబ్జాదారుల కబంధ హస్తల్లో ఆక్రమ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు.
రేపటి తరానికి నేచర్ అందించిన చెరువుల, కుంటల కాపాడాలని పేరుకు పెద్దమను షులు ప్రభుత్వ భూములను కబ్జాలు చేయడం సరికాదని, స్వచ్చందoగా ప్రభుత్వ భూము లను ప్రభుత్వo ఆధీనంలోకి అందించాలని కబ్జాదారులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి మంచి నిర్ణయంతో తెచ్చిన హైడ్రా చట్టం కోరుట్లలో కూడా అమలు చేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని , ప్రజాప్రతినిధు లను పేట భాస్కర్ కోరారు.ఈ సమావేశంలో కోరుట్ల డెవలప్ మెంట్ ఫోరం అధ్యక్షులు చెన్న విశ్వనాథం, గంగపుత్ర సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఇట్యాల రాజేందర్,కార్మిక నేత సుతారి రాములు, రాస భూమయ్య, జేఏసీ, అంబేద్కర్ సంఘాల నాయకులు శనిగారపు రాజేష్, జాగర్ల రాజయ్య, రాజయ్య, బింగి లక్ష్మీ కాంతం, అందె వంశీ, సామల్ల రాజేశం, ఎనుగందుల రాజనర్సయ్య, మరిపెల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.






