1 August, 2026 | 9:45 AM

ఆల్ఫోర్స్ బాలికల పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి సంబరాలు

24-08-2024 05:02 PM

కరీంనగర్: అల్ఫోర్స్ ఇ-టెక్నో బాలికల పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించుకున్నారు. బాలికలు కృష్ణుడు, గోపిక వేషధారణలు ధరించి, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంతో పాఠశాల ప్రాంగణమంతా పండుగ శోభను సంతరించుకుంది. ఇందులో భాగంగానే విద్యార్థులు శ్రీ కృష్ణుడి జన్మవృత్తాంతం, గోవర్ధన గిరి, కాలీయ మర్ధనం, శ్రీకృష్ణ లీలలను నాటక రూపంలో ప్రదర్శించటం మరెంతో ఆకర్శించింది.

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పాఠశాల చైర్మన్ డా. వి నరేందర్ రెడ్డి గారు పాఠశాల ప్రాంగణం లో ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో విద్యార్థులతో పాటు పాల్గొని ఎంతో ఆనందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆచార వ్యవహారాలను - సాంప్రదాయలను తెలియచేస్తాయని, చదువుతో పాటు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని విద్యార్థులకు సందేశమిచ్చారు. ఈ కారక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.