15 April, 2026 | 1:16 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

మంత్రి ఉత్తం, ఎమ్మెల్యే పద్మావతి దంపతులను విమర్శిస్తే సూర్యుని మీద ఉమ్మి వేసినట్లే..

03-11-2025 12:44 AM

మాజీ ఎమ్మెల్యే బొల్లం ఆరోపణలపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు, కాంగ్రెస్ నాయకులు

కోదాడ, నవంబర్ 2: నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యం మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి లేనని నిజాయితీతో పరిపాలన చేస్తున్న మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి లను విమర్శించే స్థాయి కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు లేదని, ఈ విషయమై బొల్లంతో బహిరంగ చర్చకు సిద్ధమని కోదాడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు అన్నారు ఆదివారం తన నివాసంలో మంత్రి ఉత్తం ఎమ్మెల్యే పద్మావతి లపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన నిరాధార అసత్య ఆరోపణలను ఖండిస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఎమ్మెల్యేగా ఉండే ఐదు సంవత్సరాల పాటు నియోజకవర్గంలో ల్యాండు సాండ్ లిక్కర్ దందా లపై కమిషన్లు బహిరంగంగా తీసుకున్నది ఎవరో కోదాడ ప్రజలందరికీ తెలుసు అన్నారు. కోదాడ నియోజకవర్గంలో జరిగిన అవినీతిపై అభివృద్ధిపై తాము చర్చలకు సిద్ధమేనని టైం ప్లేస్ డిసైడ్  చేసుకోవచ్చని సవాలు విసిరారు. కోదాడ నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ఎత్తిపోతల పథకాలకు రోడ్లకు ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ప్రభుత్వ వైద్యశాల  ఆర్టీసీ బస్టాండ్కు అభివృద్ధి చేస్తున్న విషయం కనిపించడం లేదా అన్నారు.

ఎర్రవరం పిఎసిఎస్ చైర్మన్ నల్లజాల శ్రీనివాసరావు, పారా వెంకటేశ్వర్లు, నెమ్మది దేవమని, వంగవీటి శ్రీనివాసరావు, కర్రీ సుబ్బారావు, ఎండి ఖాజా మొయినిద్దీన్, రావెళ్ళ కృష్ణారావు వంటి పులి శ్రీనివాస్, మల్లు వెంకటరెడ్డి మల్లు నాగిరెడ్డి, వెంకటేశ్వరరావు మేకపోతుల సత్యనారాయణ, కందరపోయిన పెద్ద వేలాద్రి, బొలిశెట్టి రాము, చిత్తులూరి భీమయ్య, మైలారం శెట్టి భాస్కర్ షేక్ ఇక్బాల్, లైటింగ్ ప్రసాద్ వెంకటేశ్వరరావు, అవిరే వెంకటేశ్వర్లు పాల్గొన్నారు