calender_icon.png 3 November, 2025 | 11:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి నిల్వతో నిత్యం ప్రమాదాలే.. కాల్వను పూడ్చిన అక్రమార్కులు

03-11-2025 12:44:31 AM

అధికారులకు తెలిసినా పట్టించుకోని వైనం 

కల్వకుర్తి అక్టోబర్ 02: వ్యవసాయ పొలాలను స్థిరాస్తి వ్యాపారులు కొనుగోలు చేసి ప్లాట్ల నిర్మాణం చేస్తున్నారు. అనేక చోట్ల చెరువులను కుంటలను సైతం తమ ఆధీనంలోకి తీసుకొని ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారు. చెరువులు ఆలుగు పారితే కింద ఉన్న వ్యవసాయ పొలాలకు కాలువల ద్వారా నీరు వెళ్లే మార్గాలు ఉండేవి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అటువంటి వా టిని ధ్వంసం చేసి తమకు అనుకూలంగా మలుచుకొని వ్యాపారాలు చేస్తున్నారు.

కల్వకుర్తి పట్టణ సమీపంలోని రఘుపతి పేట మార్గంలో ప్రధాన రహదారి అనుసరించి కొద్ది నెలల క్రితం వెంచర్ నిర్మానం చేశారు . వెంచర్ పైన చెరువు ఉండడంతో పైనుంచి వచ్చే నీరు వెళ్లేందుకు దారిని అనుసరించి పాటు కాలువ ఉండేది. వ్యాపారులు ఆ కాలువను పూర్తిగా పూడ్చి నామమాత్రంగా నివాసాల మధ్య ఉన్నట్లుగా డ్రైనేజీ కాలువను నిర్మించారు. చిన్నపాటి వర్షం వచ్చినా అందులో నీళ్లు పట్టక రోడ్డుపై నుండి పారుతున్నాయి .

అక్కడే ప్రమాదకరంగా మలుపు ఉండడం రోడ్డుపై నీరు నిల్వ ఉండడంతో నిత్యం వాహనదారులు ప్రమాదాల గురవుతున్నారు. అయినప్పటికీ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గతంలో వర్షపు నీరు ఎలా వెళ్లేదో అదే తరహాలో కాలువను తిరిగి నిర్మించాలని, రోడ్డుపైకి నీరు రాకుండా చూడాలని వాహనదారులుకోరుతున్నారు.