తిమ్మాపూర్ పెద్ద చెరువులో చేపల వలలో చిక్కిన మొసలి
15-06-2026 12:00 AM
ఎర్రవల్లి, జూన్ 14: గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం తిమ్మాపూర్ గ్రామంలోని సొసైటీ చెరువులో ఆదివారం ఉదయం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఊహించని ఘటన ఎదురైంది.చేపల కోసం వేసిన వలలో ఓ భారీ మొసలి చిక్కుకుంది. చెరువులో చేపల వేట నిర్వహిస్తున్న సమయంలో వల బరువుగా అనిపించడంతో పరిశీలించగా అందులో మొసలి చిక్కుకున్నట్లు గుర్తించారు.
దీంతో మత్స్యకారులు అప్రమత్తమై మొసలిని సురక్షితంగా అదుపులో ఉంచారు.ఈ విషయాన్ని తిమ్మాపూర్కు చెందిన నారాయణ నాయుడు స్థానిక పోలీసు శాఖతో పాటు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మొసలిని స్వాధీనం చేసుకుని తగిన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. మొసలిని చూసేందుకు గ్రామస్తులు ఎగబడ్డారు






