15 June, 2026 | 1:25 AM

ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారానే సమాజ ప్రగతి సాధ్యం

15-06-2026 12:00 AM
  1. పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు
  2. జిల్లా పెరిక కుల సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు పురస్కారాల ప్రదానోత్సవం

సూర్యాపేట, జూన్ 14 (విజయక్రాంతి) : విద్యార్థుల ప్రతిభ గుర్తించి వారిని ప్రోత్సహించడం ద్వారానే సమాజ ప్రగతి సాధ్యమవుతుందని రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగర వెంకటేశ్వర్లు అన్నారు.సూర్యాపేట జిల్లా పెరిక కుల సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం జిల్లా కేంద్రంలోని రాకేష్ బి.ఎడ్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని కృషి, పట్టుదలతో చదువుకుంటే జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించన్నారు. విద్యే సమాజ అభివృద్ధికి మూలాధారమని, నేటి విద్యార్థులే రేపటి భారతదేశ భవిష్యత్తన్నారు.

పెరిక కుల కార్పొరేషన్ విధివిధానాలు పూర్తికాగానే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చేయూతను అందించడం జరుగుతుందన్నారు. అనంతరం పదవ తరగతి, ఇంటర్మీడియట్, సీబీఎస్‌ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు నగదు పురస్కారాలు, మెమొంటోలు, ప్రశంసా పత్రాలు అందజేసి విద్యార్థులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పెరిక కుల సంఘం అధ్యక్షులు బందు శ్రీధర్ బాబు, మిన్న శివరామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి పాయిలి వెంకటనారాయణ, నాయకులు గుండా కృష్ణ, యర్రంశెట్టి సైదయ్య, కీత సుధాకర్, తిపిరిశెట్టి రాజు, బందు వీరయ్య, తొగరు మల్లికార్జున్, బొలిశెట్టి మధు, పోకల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.