ఉమామహేశ్వరంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు
అచ్చంపేట జూన్ 14 (విజయక్రాంతి): ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఉత్తర ద్వారంగా బాసిల్లుతున్న శ్రీ ఉమా మహేశ్వరం ఆలయాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వినాయకుడు మహిషాసురమర్ధిని అయ్యప్ప స్వామికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
అర్చకులు వీరయ్య శాస్త్రి తీర్థ ప్రసా దాలు అందించి ఆశీర్వదించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బీరం మాధవరెడ్డి పాలకవర్గ సభ్యులు కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా సన్మానించారు. అనంతరం ఆలయ పరిసరాలను కలెక్టర్ కుటుంబ సమేతంగా సందర్శించి తన్మయత్నం పొందారు. ఆలయ విశిష్టతను అర్చకులు వివరించారు. దక్షిణ కాశీగా ఖ్యాతి గడించినట్లు తెలిపారు. వారితో పాటు ఆలయ సిబ్బంది, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.






