15 April, 2026 | 3:16 AM

వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలు

15-04-2026 12:51 AM

ఎలాంటి ఫిర్యాదు అందలేదన్న హార్టికల్చర్ అధికారి

చేవెళ్ల ఏప్రిల్ 14(విజయక్రాంతి): చేవెళ్ల మున్సిపాలిటీ, మండల పరిధిలో సోమవారం రాత్రి ఈదురుగాలతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఈ వానకు కూరగాయల రైతులు తీవ్రంగా నష్టపోయాయి. మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి.  చన్వెల్లి గ్రామానికి చెందిన రైతులు భుజంగ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, తిరుపతి రెడ్డికు చెందిన బీర, కాకర పంటలు దెబ్బతిన్నాయి. మరో రైతు పాలీ హౌస్ నేలకూలింది. 

రాత్రి 12 గంటల నుంచి 3:30 వరకు  కురిసిన వానకు పామెన, ఉరెళ్ల, కేసారం, ఎర్రోనికొటాల, తంగేడు పల్లి, అంతారం, నాంచేరు తదితర గ్రామాలకు కరెంట్ కట్ అయ్యింది. కొన్ని గ్రామాల్లో వర్షం లేకపోయినా కరెంట్ కట్ చేయడంపై గ్రామస్తులు మండిపడ్డారు. పంట నష్టం పై స్థానిక ఆర్టికల్చర్ అధికారి నీ వివరణ కోరగా రైతుల నుండి  పంట నష్టం గూర్చి తమ దృష్టికి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.