పోటీచేసిన అన్నిచోట్లా గెలుస్తాం
- తమిళనాడులో రాహుల్‌గాంధీకి ప్రజాదరణ పెరుగుతున్నది
- ఊటీ అభివృద్ధికి కట్టుబడి ఉంటాం
- తేయాకు తోటల రైతుల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు
- బీజేపీ ఎత్తుగడలను తిప్పికొట్టండి
- తమిళనాడు ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): డీఎంకే కూటమితో పొత్తు పెట్టుకుని పోటీచేస్తున్న అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయనుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌గాంధీకి రోజురోజుకు పెరుగుతున్న ప్రజాదరణనే ఇందుకునిదర్శనమని చెప్పారు.
తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన స్టార్ క్యాంపెయన్‌గా నియమితులైన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం నుంచి అక్కడ జరుగుతు న్న ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొంటూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నీలగిరి జిల్లా ఊటి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఉత్తమ్‌కు మార్‌రెడ్డి పాల్గొన్నారు. ఊటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న బీ రామచంద్రన్‌ను గెలిపిస్తే ఊటి ఉన్న ప్రాశస్త్యం కాపాడటంతోపాటు భివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
ప్రధానంగా తేయాకు తోటల మీద ఆధారపడి ఉన్న రైతాం గాం ప్రయోజనాల పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తమిళనాడులో పాగా వేసేందుకు రంగంలోకి దిగిన బీజేపీని కట్టడి చేసి సంస్కృతి, సంప్రదాయల పరిరక్షణకు ఓటర్లు సిద్ధ పడాలని పిలుపునిచ్చారు. తమిళనాడులో మళ్లీ వచ్చేది డీఎంకే-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. కూటమిలో భాగంగా కాంగ్రెస్ పోటీచేస్తున్న 28 స్థానాల్లో పార్టీ విజ యం సునాయాసమేనని ధీమా వ్యక్తంచేశారు. అంతర్గత సర్వేలు అన్నీ అవే ఉటంకిస్తున్నాయని తెలిపారు.
గడిచిన ఎన్నికలతో పోల్చి చూసినప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల మెజార్టీ శాతం గణనీయంగా పెరగనుందని పేర్కొన్నారు. ఊటి వంటి నియోజకవర్గంలో ఎవరూ ఊహించని మెజారిటీ రాబోతుందని చెప్పారు. తమిళనాడు కాంగ్రెస్ వ్యహారాల ఇంచార్జి గిరీష్ చోడం కర్, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కే సెల్వపేరుంతగై రాష్ట్రవ్యాప్తంగా లీడర్‌ను, క్యాడర్‌ను సమన్వ యం చేస్తున్నారని చెప్పారు. తమిళ ప్రజలు, ఇక్క డి సంస్కృతి, సంప్రదాయలపై తనకు వ్యక్తిగతం గా ఎనలేని ప్రేమాభిమానాలు ఉన్నాయని తెలిపారు.
ఏఐసీసీ ఎన్నికల పరిశీలకుడిగా తనను ఇక్కడికి పంపిన నేపథ్యంలో పార్టీ పోటీచేస్తున్న స్థానాలోల్ల విస్తృతంగా పర్యటిస్తూ భాగస్వామ్య పక్షాలతో సహా కాంగ్రెస్ యంత్రాంగాన్ని ప్రణాళికా బద్ధంగా ఎన్నికల భేరికి సన్నద్ధం చేశామని చెప్పారు. రాష్ట్రంలో డీఎంకే- -కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి వచ్చాక ఊటిలో కావలసిన మౌలిక స దుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని భరోసా ఇచ్చారు.






