31 July, 2026 | 5:30 PM

భారీ వర్షాలతో నీట మునిగిన పంటలు

31-07-2026 04:43 PM

బేల: ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బేల మండలంలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ పొలాలు పూర్తిగా నీటమునిగాయి. పొలాల్లో నిల్వ నీరు చేరడంతో పత్తి, సోయాబీన్, వరి తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు ఎక్కువసేపు నిలువ ఉంటే పంటలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే నష్టపోయిన పంటలను పరిశీలించి, ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందించాలని కోరుతున్నారు.