16 March, 2026 | 4:05 AM

గుస్సాడీ ఉత్సవాలకు 1.50 కోట్లు

31-10-2024 01:56 AM

 హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించే దండారి-గుస్సాడీ ఉత్సవాలకు రూ.1.50 కోట్లు విడుదల చేస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీడీఏ ఉట్నూరు ప్రతిపాదనల మేరకు ఈ నిధులు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.